సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక డాక్టర్దాశరథి కృష్ణమాచార్యుల స్మారక పురస్కారం ప్రకటించడం హర్షణీయమని కొల్లాపూర్ కవులు, రచయితలు వేదార్థం మధుసూదన శర్మ, ఆమనికృష్ణ, డాక్టర్గూడెలి శీనయ్య, వేముల కోటయ్య, డాక్టర్రాంచందర్ రావు, మేనావత్ రాందాస్ నాయక్, గడ్డం వెంకటరమణ, ముమ్మిడి చంద్రశేఖరాచారి, పరశురాముడు తదితరులు బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతిగా, […]
సారథి, కోడేరు(కొల్లాపూర్): నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు ప్రభుత్వ పశువైద్య కేంద్రంలో మూగజీవులకు మందులను అందుబాటులో ఉంచకుండా ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్న పశు వైద్యాధికారి డాక్టర్ భానుకిరణ్ పై చర్యలు తీసుకోవాలని యాదవ సంఘం మండల గౌరవాధ్యక్షుడు యాపట్ల శేఖర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మందులు సరఫరా చేస్తుండగా, ఆయన మాత్రం మందులు ఇవ్వకుండా నాగర్ కర్నూల్, సింగోటంలోని ప్రైవేట్మెడికల్ షాపునకు చీటీలు రాస్తున్నారని పేర్కొన్నారు. రైతులు, గొర్రెల కాపరుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మందులను సింగయిపల్లిలో నిల్వచేసి […]
సారథి, కొల్లాపూర్(పెద్దకొత్తపల్లి ): నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్న కార్ పాముల గ్రామంలో పేకాట ఆడుతున్న 9మంది పేకాటరాయుళ్ల స్థావరాలపై దాడిచేసి అరెస్టు చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. వారి నుంచి రూ.8,940 నగదు, అలాగే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. మున్ముందు గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కఠినమైన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.
సారథి, కొల్లాపూర్: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలో జిల్లా అడిషనల్కలెక్టర్ మనుచౌదరి, చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి, చంద్రశేఖరాచారి శుక్రవారం పట్టణంలోని 20వ వార్డులో మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. పట్టణ ప్రగతి పనులపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైద్యసిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
సారథి, కొల్లాపూర్: కృష్ణానది నీటిని అక్రమంగా ఏపీ ప్రభుత్వం తరలించడాన్ని నిరసిస్తూ శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాను జయప్రదం చేయడానికి కొల్లాపూర్ నుంచి సీపీఐ నాయకులు బయలుదేరారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య మహిళా కార్యదర్శి ఇందిర, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కిరణ్, జిల్లా సమితి నాయకులు కురుమయ్య, కొల్లాపూర్ టౌన్ కార్యదర్శి ఎండీ యూసుఫ్, హమాలీ యూనియన్ అధ్యక్షుడు సత్యం, వెంకటాచలం, శీను, గంగన్న, హరికురుమయ్య, ఎల్లయ్య, వెంకటమ్మ, చిన్నమ్మ, కురుమయ్య, చెన్నకేశవులు, ఎం.నరసింహ, […]
సారథి, కొల్లాపూర్: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారనున్నాయని నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతమ్మ, కలెక్టర్ ఎల్.శర్మన్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు, ముక్కిడిగుండం, పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటారు. మన ఇంటిని, వీధిని, ఊరును మనమే శుభ్రంగా ఉంచుకోవాలని, పల్లె ప్రగతి కార్యక్రమం ఉద్దేశం అదేనని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో […]
సారథి, కొల్లాపూర్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి, వెన్నచర్ల గ్రామాల్లో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజలతో కలిసి పల్లెప్రగతి కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా ఇంటింటా చెత్తసేకరణ, […]
సారథి, కొల్లాపూర్: ఉపాధి హామీ పథకంలో చేసిన పనులను డబ్బులు చెల్లించాలని డిమాండ్‌చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు ఎంపీడీవో ఆఫీసు ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. కూలీలు ఉపాధి పనులు చేస్తున్నా ఏడు వారాల నుంచి కూలి చెల్లించడం లేదన్నారు. ఇప్పటివరకు ఎంత వస్తుందో కూలీలకు తెలియడం లేదన్నారు. పే స్లిప్ అందజేయాలని కోరారు. తాగునీరు, మెడికల్ కిట్ల అందుబాటులో […]