మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్ ను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతం ఆదేశించారు. మంగళవారం హరితహారం పల్లెప్రగతి పనులను పరిశీలించేందుకు కేసముద్రం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కేసముద్రం పట్టణం, ఇనుగుర్తి, లాలూ తండా, తౌర్య తండాల్లో పర్యటించి హరితహారం తీరు తెన్నులను పరిశీలించారు. లాలూ తండాలోని 4 ఎకరాల్లో చేపట్టిన అటవీశాఖ నర్సరీని సందర్శించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాచందన, తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎంపీడీవో రోజా రాణి తదితరులు […]