సారథి న్యూస్, ములుగు: బాలల హక్కుల రక్షణకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్జీ ఆనంద్ సూచించారు. గురువారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేడారం టోర్నమెంట్ క్రీడల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో ఆటలపోటీల ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. అనంతరం […]
సారథి న్యూస్, ములుగు: ప్రభుత్వ కాలేజీలు, ఆఫీసులు అన్ని వసతులతో పరిశుభ్రంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఎంత మంది సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, తరగతి గదుల వివరాలను జిల్లా కలెక్టర్ ఇన్చార్జ్ప్రిన్సిపాల్ కె.లక్ష్మయ్యను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రతను పాటిస్తూ కళాశాల […]