సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బూడిదపాడు గ్రామంలో విద్యుత్ షాక్ తో షేక్షావలి(60) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. గ్రామంలో రోజు మాదిరిగానే నర్సరీలో మొక్కలకు నీళ్లుపడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కన్నుమూశాడు. షేక్షావలి ఉపాధి సేవకుడిగా పనిచేస్తున్నాడని, రోజు మాదిరిగానే నీళ్లు పడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు శాంతినగర్ ఎస్సై శ్రీహరికి సమాచారం అందించారు. ఆయన సంఘటనస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో హల్ చల్ సృష్టిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు గ్రామంలో నిత్యం తిరుగుతున్నారు. బయట రోడ్లపై కనిపించిన వారిని బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు, బంగారు నగలు, విలువైన వస్తువులను లాక్కెళ్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటలకు పుల్లూరు గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామంలో భారీవర్షానికి గ్రామానికి చెందిన బోయ నడిపి ఉషన్న ఇల్లు శనివారం రాత్రి కూలిపోయింది. సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయంగా రూ.రెండువేలు అందజేశారు. బాధిత కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట భాస్కర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.