చెన్నై: అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఇంటి ఓనర్ను హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన చెన్నైలోని కుండ్రటూర్లో చోటుచేసుకున్నది. కుండ్రటూర్కు చెందిన గుణశేఖర్(51) ఇంట్లో కొంతకాలంగా ధనరాజ్ అనేవ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. అయితే నాలుగునెలలుగా ధనరాజ్ యజమానికి అద్దె కట్టడం లేదు. దీంతో బుధవారం రాత్రి రెంట్ కట్టాలంటూ గుణశేఖర్.. ధనరాజ్పై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కోపోధ్రిక్తుడైన ధనరాజ్ కుమారుడు అజిత్.. ఇంటి ఓనర్పై కత్తితో విచక్షణారహితంగా దాడిచేయడంతో అతడు […]