సారథి న్యూస్, కర్నూలు: బాలింతలు, గర్భిణులకు ఆరోగ్య భరోసా కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 7 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అమలుకు ఏర్పాట్లు చేశామని ఐసీడీఎస్ పీడీ శారద భాగ్యరేఖ తెలిపారు. పథకాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాంపు ఆఫీసు నుంచి ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో వెబ్ టెలికాస్ట్‌ను ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్ సిబ్బంది, లబ్ధిదారులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాటుచేస్తామన్నారు. ఐసీడీఎస్ […]