సారథి న్యూస్, కర్నూలు: మహిళ ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలుచేసిందని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ మురళి అన్నారు. ఆదివారం నగరంలోని ముజాఫర్ నగర్‌లో వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితిలోనూ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చినమాట ప్రకారం వైఎస్సార్ ఆసరా నిధు సమకూర్చడం సంతోషించదగ్గ విషయమని, వనితలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్కాచెల్లెమ్మలకు ఆసరా, జగనన్న అమ్మఒడి, […]
సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా శనివారం కర్నూలు నగరంలోని జొహరాపురంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, జగన్న గోరుముద్దు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష తదితర పథకాలు పేదల కోసమే అమలుచేస్తున్నారని వివరించారు. 161 స్వయం సహాయక సంఘాలకు రూ.4,17,87,908ను నాలుగు విడతల్లో జొహరాపురంలో ఇస్తున్నామని తెలిపారు. మొదటి విడత రూ.1,04,46,977ను 161 స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్నామని వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి […]