సారథిన్యూస్, హన్మకొండ: ‘నా చావుకు కారణం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కేసీఆర్ సార్.. వచ్చే ఎన్నికల్లో అతడికి టికెట్ ఇవ్వొద్దు’ అని లెటర్ రాసి ఓ వ్యక్తి గొంతు కోసుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా అలంకానిపెట చెందిన మాసం వెంకటేశ్వర్లు సోమవారం హన్మకొండలోని అదాలత్ వద్ద అమరవీరుల స్తూపం ముందు కత్తితో గొంతు కోసుకున్నాడు. రక్తం ధారలు కట్టడంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం […]
సారథిన్యూస్, జనగామ: సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవాపురంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన శ్రీకాంత్(20) కొంతకాలంగా సెల్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులు అడుతున్నాడు. ఆర్థికపరిస్థితి బాగా లేకపోవడంతో వారు కొనివ్వలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.