ఆడుకుంటూ వెళ్లి అందులోపడ్డ బాలుడు సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లి గ్రామంలో ఆడుకుంటూ వెళ్లిన సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరు బావిలో పడ్డాడు. బుధవారం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం 120 నుంచి 150 అడుగుల లోతులో బాలుడు ఉన్నాడు. రెస్య్యూటీమ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. సంఘటన స్థలానికి నాలుగు జేసీబీలు చేరుకుని పనులు చేపట్టాయి. మెదక్ […]