‘ఐస్‌క్రీం’ ఫేం తేజస్వీ ముదివాడ.. కమిట్మెంట్ అనే ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఓ హాట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే పలు చిత్రాల్లో తేజస్విని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ సీజన్2లో పాల్గొని కొంత పాపులర్ అయ్యింది. తాజాగా ఇప్పడో రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో ఆమె కొంత బోల్డ్‌గానే నటించనున్నట్టు సమాచారం. సినీ పరిశ్రమలో ఉండే మోసాలు, వేధింపులే ప్రధానకథాంశంగా ఈ […]
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ కొత్తపంథాను ఎంచుకోన్నారు. కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడగా.. నటీనటిలందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈక్రమంలో ప్రకాశ్‌రాజ్ కూడా ఓ వెబ్‌సీరిస్‌లో నటించనున్నట్టు తెలిసింది. దీని చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఓ యాధార్థ ఘటన ఆధారంగా ఈ వెబ్‌సీరిస్‌ను రూపొందిస్తున్నారట. దీనిలో ప్రకాశ్‌రాజ్ నటించడమే కాక కథా సహకారం కూడా అందిస్తున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ప్రముఖ రచయిత మధుబాబు రచించిన షాడో నవల తెలుగు పాఠకులను ఎంతో ఆకట్టుకున్నది. ఈ నవలా ఆధారంగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇప్పడో వెబ్‌సీరిస్‌ను తెరకెక్కిస్తున్నది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు ఎవరన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ‘రాజా చేయ్యవేస్తే’ సినిమా దర్శకుడు ప్రదీప్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పినట్టు సమాచారం. ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానున్నది.