సామాజిక సారథి, చొప్పదండి: నేటి యువతకు వివేకానందుడు ఆదర్శప్రాయుడని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, నెహ్రూ యువకేంద్ర జిల్లా కోఆర్డినేటర్ వెంకట్ రాంబాబు కొనియాడారు. నెహ్రూ యువకేంద్ర, నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా చొప్పదండిలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆఖండ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిఖ్యాత తత్వవేత్త, గొప్పవ్యక్తి అని కొనియాడారు. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పుల్లూరు గ్రామపెద్దలు చల్లా గిరిధర్ రెడ్డి, కలుగోట్ల పీఏసీఎస్ చైర్మన్ గజేందర్ రెడ్డి, సర్పంచ్ నారాయణమ్మ, ఎంపీటీసీ సభ్యులు […]