సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావు శనివారం వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ లో కుటుంబ సమేతంగా వినాయకుడికి పూజచేశారు. మంత్రి కె.తారక రామారావు సతీమణి శైలిమా, కుమారులు, కుమార్తె, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.