సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇందు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమైన నిధులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాలను ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తప్పితే.. ఇంకెప్పుడు గ్రామాలు బాగుపడవని అన్నారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ […]