సామాజికసారథి, ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల్లో అతికష్టం మీద టీఆర్‌ఎస్ బయటపడి గెలిచిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో నైతికంగా కాంగ్రెస్ గెలిచిందన్నారు. కేవలం 96 ఓట్లు ఉన్న కాంగ్రెస్‌కు 242 ఓట్లు రావడమే అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ లేదన్న అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించామని అన్నారు.
సారథి న్యూస్, మధిర: కరోనాతో కకావిలమవుతున్న మధిర పట్టణంలో అంగుళం జాగా కూడా వదలకుండా శానిటైజేషన్ చేయిస్తున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. మధిర పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మొదలుపెట్టి అన్ని మెయిన్రోడ్లు, ఇరుకైన గల్లీల్లోనూ శానిటైజేషన్చేశారు. కరోనా వైరస్వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చొరవను చూసి పలువురు అభినందిస్తున్నారు. ఆయన వెంట మధిర మార్కెట్ కమిటీ మాజీ […]