Breaking News

VIKARABAD

తెగిన కాగ్నా వంతెన

సారథిన్యూస్​, వికారాబాద్‌: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా కొండంగల్​​- తాండూరు రహదారిపై వంతెన తెగిపోయింది. కాగ్నా నదిపై ఉన్న ఈ బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వర్షంతో తాండూరు నియోజకవర్గంలోని పంటపొలాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి. ​

Read More

సిరిసిల్ల దీటుగా కొడంగల్ ​

సారథి న్యూస్, వికారాబాద్: వికారాబాద్​ జిల్లా బొంరాస్​పేట మండలం మెట్లకుంటలో రూ.1.15 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీరోడ్డును మంగళవారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనంతరం రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించడం ద్వారా అభివృద్ధి పనులకు సుమారు రూ.250 కోట్ల నిధులు వచ్చాయన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి దీటుగా కొడంగల్​ను అభివృద్ధి చేస్తామనడం ఈ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్​కు ఉన్న ప్రత్యేకశ్రద్ధ అర్థమవుతుందన్నారు. కొడంగల్​ఎమ్మెల్యే నరేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రతిష్టాత్మకంగా హరితహారం

సారథి న్యూస్​, హైదరాబాద్​: వికారాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్, తాండూర్, పరిగి పట్టణాల పట్టణాల అభివృద్ధిపై చర్చ జరిగింది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పట్టణాల్లో పార్కులు. ఫుట్ పాత్ రోడ్లు, టాయిలెట్లు, శ్మశాన వాటికల పనులపై సూచనలు చేశారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ […]

Read More
హక్కుల కోసం పోరాటం తప్పదు

హక్కుల కోసం పోరాటం తప్పదు

సారథి న్యూస్, చేవెళ్ల: వికారాబాద్​ జిల్లా చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం మే వేడుకలు ఘనంగా జరిగాయి. చేవెళ్లలో ఏఐటీయూసీ  రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి కార్మిక జెండాను ఎగరవేశారు. శ్రమను నమ్ముకుని జీవిస్తున్న ప్రతి కార్మికుడు తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో లాక్​ డౌన్​ కారణంగా ప్రతి కార్మికుడికి వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్డె సత్యనారాయణ, మండల కార్యదర్శి సుధాకర్​ గౌడ్​, ఎండీ మక్బుల్, […]

Read More