రూ.3లక్షల విలువైన పంచలోహ విగ్రహాల అపహరణ సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గుట్టపై వెలిసిన వేంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.3లక్షల విలువ చేసే పంచలోహ విగ్రహాలను ఎత్తికెళ్లారు. వేంకటేశ్వర స్వామి, అలవేలు మంగమ్మ, పద్మావతి విగ్రహాలు చోరీకి గురైయ్యాయి. సుదర్శనచక్రం, స్వామి, మరో రెండు విగ్రహాలను ఎత్తికెళ్లారు. వాటి విలువ సుమారు రూ.రెండు లక్షల మేర ఉంటుందని పూజారి శివయ్యశర్మ తెలిపారు. […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. కార్తీక మాసం చివరి శనివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ అమ్మవారికి సుప్రభాతసేవ, అభిషేకం, ఆరాధన నైవేద్యం, ఇతర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఆలయ ప్రధానార్చకుడు రామానుజాచార్యులు తెలిపారు. పక్కనే ఉన్న శివాలయంలో పరమశివుడికి ఏకరుద్రాభిషేకాలు, దీపారాధన నిర్వహించినట్లు వెల్లడించారు. అనంతరం స్వామివారి […]