సారథి, నూగురు వెంకటాపురం: వెంకటాపురం మండలంలోని పాత్రాపురం గ్రామంలో నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న గ్రేస్ అనాథ వృద్ధాశ్రమాన్ని బుధవారం డీడబ్ల్యూవో ప్రేమలత తని ఖీచేశారు. వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ఆశ్రమం వారు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి ఆరాతీశారు. ఆశ్రమం ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా నడుస్తుందా? అనే విషయాలను ఆరాతీశారు. పలురకాల రిజిస్టర్లను పరిశీలించారు. ఆశ్రమానికి ఫండ్స్ ఎలా వస్తున్నాయనే విషయాలను విచారించారు. ప్రభుత్వ సహకారానికి కూడా తమ వంతు కృషిచేస్తామని తెలిపారు. ఇదే విషయమై పై అధికారులకు […]
సారథి, నూగూరు వెంకటాపురం: ఏజెన్సీలో వేలంపాట రాజ్యాంగ విరుద్ధమని, గ్రామసభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి అన్నారు. మంగళవారం ఏఎన్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మేజర్ గ్రామ పంచాయతీలో మార్కెట్ ఆశీలు, జంతు వధశాల, కొలగార కాటరుసుం, బందెలదొడ్డి వేలంపాట ఏజెన్సీలో పెసా గ్రామసభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని కోరారు. మేజర్ గ్రామ పంచాయతీ ఈవో పెసా చట్టానికి విరుద్ధంగా వేలంపాట నిర్వహించాలని […]
సారథి న్యూస్, వెంకటాపురం: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకదృష్టి సారించి, నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తిచేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య సూచించారు. శుక్రవారం కలెక్టర్, ఐటీడీఏ పీవో హన్మంతు కె జండగే తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి వ్యక్తిగత శ్రద్ధతో నిర్ణీత లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. మండలంలో 9,774 ఇళ్లు ఉండగా,8,658 ఇన్లైన్ […]