గుండెపోటుతో కొడుకు వెంకటేష్ మృతి ప్రముఖ సీనియర్ నటి, కళాభినేత్రి వాణిశ్రీ ఇంట్లో పెనువిషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో కొడుకు మృతిచెందాడు. 2004లో తారకరత్న సినిమా ‘భద్రాద్రి రాముడు’లో కనిపించారామె. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వాణిశ్రీకి కుమార్తె అనుపమ, కుమారుడు అభినయ వెంకటేష్ ఇద్దరు పిల్లలు. వెంకటేష్ చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో తన స్టడీస్ పూర్తిచేసి ప్రస్తుతం ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వెంకటేష్ భార్య కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. […]