సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే మరో 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నామని మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇప్పటికే 1.31లక్షల ఉద్యోగాలను భర్తీచేశామన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడా కరెంట్ సమస్య లేదన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. దేశంలోనే పారిశ్రామిక రంగానికి సరిపడా కరెంట్ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. సమావేశంలో […]