సారథి, రామాయంపేట: పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్టంలో కులవృత్తులను రక్షించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, రజక, నాయీ బ్రాహ్మణులను ఆదుకునేందుకు విద్యుత్ బిల్లు మాఫీ చేయడం పట్ల రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంఘ స్వామి హర్షం వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దోభీఘాట్లకు, లాండ్రీ షాప్, సెలూన్ షాపులకు 250 యూనిట్లలోపు విద్యుత్ బిల్లు మాఫీచేయడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ యువ నాయకులు అత్వెల్లి నాగరాజు అన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన తమ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. నిరుద్యోగుల కోసం భృతి ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. ప్రతిపక్షాలు చేసే అర్థరహితమైన విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో కనిపించని నాయకులు ఉద్యమకారులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.