అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు తాడిపత్రి వాసులేనని తేలింది. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారు హేమలత, సుబ్రమణ్యం, వెంకటరంగయ్యగా గుర్తించారు.