Breaking News

TELANGANA

ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

సారథి, హైదరాబాద్: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 19న ఆయనకు కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన గజ్వేల్‌లోని తన ఫాంహౌజ్‌లోనే ఐసోలేషన్‌లో ఉండిపోయారు. 28న ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో వైద్యులు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా, నెగెటివ్ అని వచ్చింది. 29న ఆర్టీపీసీఆర్‌లో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చివరికి మే 4న  కరోనా నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారని వ్యక్తిగత వైద్యులు ధ్రువీకరించారు. […]

Read More
ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తం

ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తం

సారథి, రామడుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఈటల రాజేందర్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తామని ముదిరాజ్ మహాసభ నాయకులు హెచ్చరించారు. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ లో ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు, మచ్చలేని మంచి మనిషి ముదిరాజ్ ల ఆరాధ్యదైవం అని కొనియాడారు. […]

Read More
ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు సారథి, సిద్దిపేట ప్రతినిధి: ప్రజాస్వామ్య పరిరక్షణకు తప్పకుండా ఓటు వేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23 వ వార్డులోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ లో ని 69 బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలకు లోబడే ఓటింగ్ జరుగుతుందని, కరోనాను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచినట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు […]

Read More
మహాజాతరకు తేదీలు ఖరారు

మహాజాతరకు తేదీలు ఖరారు

సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన వేడుకగా పేరొందిన మేడారం మ‌హా జాత‌ర తేదీలు ఖ‌రారు అయ్యాయి. 2022 ఫిబ్రవ‌రి 16 నుంచి 19వ తేదీ వ‌ర‌కు మేడారం స‌మ్మక్క, సార‌ల‌మ్మ జాత‌ర‌ను నిర్వహించనున్నారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో వెలిసిన ఆదివాసీ గిరిజన దైవం మేడారం సమ్మక్క, సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సంప్రదాయ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వచ్చే సంవత్సరం నిర్వహించే జాతర తేదీలను పూజారులు […]

Read More
మంత్రులు కేటీఆర్, నిరంజన్​రెడ్డి త్వరగా కోలుకోవాలి

మంత్రులు కేటీఆర్, నిరంజన్​రెడ్డి త్వరగా కోలుకోవాలి

మానవపాడులో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు సారథి, మానవపాడు: రాష్ట్ర ఐటీ, మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, అదే విధంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని జామియా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే యువ నాయకుడు కేటీఆర్​కరోనా సమయంలో కూడా ప్రజల ఆరోగ్యం బాగుండాలని మన మధ్య తిరుగుతున్నారని తెలిపారు. ఆయన క్షేమంగా […]

Read More
హమ్మయ్య.. ఆక్సిజన్​బండి వచ్చేసింది!

హమ్మయ్య.. ఆక్సిజన్ ​బండి వచ్చేసింది!

సారథి, హైదరాబాద్: కరోనా సెకండ్​వేవ్​విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆక్సిజన్​అందక వందల సంఖ్యలో రోగులు చనిపోతున్న విషయం తెలిసిందే. అయితే మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయిస్తానని చెప్పింది. అందులో 70 టన్నుల వరకు సమకూరింది. మిగితా ఆక్సిజన్ ను బళ్లారి, బిలాయ్, అంగుల్ (ఒడిశా) పెరంబదూర్ […]

Read More
మంత్రి కేటీఆర్​కు కరోనా పాజిటివ్​

మంత్రి కేటీఆర్​కు కరోనా పాజిటివ్​

సారథి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శుక్రవారం ఆయన ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్పగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. ‘స్వల్ప లక్షణాలతో నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోంఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కోవిడ్ […]

Read More
ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ

ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ చేసినట్లు సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు మూతపడ్డాయన్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల రోడ్డున పడడంతో సీఎం కేసీఆర్ రూ.రెండువేల నగదు వారి బ్యాంక్ అకౌంట్ లో వేయడమే కాకుండా, 25 కేజీల సన్నబియ్యాన్ని పంపిణీ చేసి, ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. […]

Read More