Breaking News

TELANGANA

మరో మూడురోజులు విద్యాసంస్థలకు సెలవు

మరో మూడురోజులు విద్యాసంస్థలకు సెలవు

సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వ‌ర్షాలు పడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని విద్యాసంస్థల‌కు మ‌రో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. రాష్ట్రంలో భారీవర్షాల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు (సోమ‌వారం నుంచి బుధవారం వ‌ర‌కు) సెల‌వులు ప్రక‌టించిన విష‌యం విధిత‌మే. అయితే వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టక‌పోవ‌డంతో మ‌రో మూడు రోజుల పాటు సెల‌వుల‌ను మరోసారి పొడిగించారు. తిరిగి సోమ‌వారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం […]

Read More
ఎస్సీ గురుకుల ‘ఎంట్రెన్స్‌’ ఫలితాలు విడుదల

ఎస్సీ గురుకుల ‘ఎంట్రెన్స్‌’ ఫలితాలు విడుదల

సామాజికసారథి, హైదరాబాద్‌: సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో చేరేందుకు నిర్వహించిన ఎంట్రెన్స్‌(ఆర్‌జేసీ సెట్‌-2022) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 19,360 సీట్ల కోసం ఫిబ్రవరి 20న నిర్వహించిన ఈ ప్రవేశపరీక్షకు 60,173 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శనివారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. మెరిట్‌ సాధించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 21 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. […]

Read More
flash.. flash.. గురుకుల సీఓఈ ఫలితాలు వెల్లడి

flash.. flash.. గురుకుల సీఓఈ ఫలితాలు వెల్లడి

సామాజికసారథి, హైదరాబాద్: గత మే నెలలో నిర్వహించిన TSWRJC & COE CET-2022 ప్రవేశపరీక్ష Phase-2 ఫలితాలు వెలువడ్డాయి. ‍మొదటి దశలో సీటు రాని వారు 2వ దశలో మీ ఫలితం చూసుకోవచ్చు. అలాగే ఈనెల 10న సాధారణ గురుకులాల కాలేజీలకు రాసిన ప్రవేశపరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. https://tsswreisjc.cgg.gov.in

Read More
జులై 1న టెట్​ఫలితాలు

flash news.. జులై 1న టెట్ ​ఫలితాలు

సామాజికసారథి, హైదరాబాద్: జులై 1వ తేదీన టెట్(TET)​ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆమె విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. టెట్ ​ఫలితాల వెల్లడిలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్​ఈఆర్టీ(SCERT) డైరెక్టర్​రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Read More
30న టెన్త్​ఫలితాలు విడుదల

flash news.. 30న టెన్త్​ ఫలితాలు విడుదల

సామాజికసారథి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన పదో తరగతి(tenth class) ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్​లోని డాక్టర్​ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలని ఆమె సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.టెన్త్​(ssc) ఫలితాల కోసంwww.bse.telangana.gov.in, www.bseresults.telangana.gov.inవెబ్​సైట్​లో సంప్రదించాలని కోరారు.

Read More
ప్లాష్.. ప్లాష్.. ఇంటర్​మీడియట్​ఫలితాలు విడుదల

flash..flash.. ఇంటర్​మీడియట్​ ఫలితాలు విడుదల

సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్​ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్​లో 63.32 శాతం, సెకండియర్​లో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. పాస్‌ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం […]

Read More
కులమత భేదాలు లేకుండా కలిసి పోవాలి

కులమత భేదాలు లేకుండా కలిసి పోవాలి

తెలంగాణ రాష్ట్ర డెంటల్ డాక్టర్స్​ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్​కర్నూల్ నియోజకవర్గంలోని ముస్లింలు కులమత భేదాలకు తావులేకుండా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండాలని తెలంగాణ రాష్ట్ర డెంటల్ డాక్టర్స్ ​అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి ఆకాంక్షించారు. ఇదే సంస్కృతిని సదా పాటించాలని కోరారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఉపవాస దీక్షలు ప్రత్యేకమైనవని అన్నారు. శనివారం నాగర్​కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో కూచకుళ్ల కొండమ్మ ఫంక్షన్ హాల్ లో […]

Read More
బీఎస్పీ నాయకుడికి పరామర్శ

బీఎస్పీ నాయకుడికి పరామర్శ

సామాజికసారథి, కల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ నాయకుడు ఆంజనేయులు ఇటీవల కరెంట్​షాక్​కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జ్​కొమ్ము శ్రీనివాస్​యాదవ్ బుధవారం ​అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆంజనేయులు బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బీఎస్పీ జిల్లా కోశాధికారి బ్రహ్మం తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More