Breaking News

TELANGANA

అన్ని ఎగ్జామ్స్​ వాయిదా

అన్ని ఎగ్జామ్స్​ వాయిదా

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా.. అన్ని ఎంట్రెన్స్ టెస్టులను అన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్​ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసెట్​, పాలిసెట్​, ఐసెట్, ఈ సెట్, పీజీసెట్, లాసెట్​, పీజీఎల్​సెట్​, ఎడ్​సెట్​, పీఈసెట్​అన్ని వాయిదాపడ్డాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని హైకోర్టుకు నివేదించింది.

Read More

సెల్​ఫోన్​ కొనివ్వలేదని..

సారథిన్యూస్​, జనగామ: సెల్​ఫోన్​ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవాపురంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన శ్రీకాంత్​(20) కొంతకాలంగా సెల్ ఫోన్​ కొనివ్వాలంటూ తల్లిదండ్రులు అడుతున్నాడు. ఆర్థికపరిస్థితి బాగా లేకపోవడంతో వారు కొనివ్వలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్​ పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

Read More
పగబట్టిన కరోనా

పగబట్టిన కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్: ప్రజాప్రతినిధులపై కరోనా మహమ్మారి పగబట్టినట్టే కనిపిస్తోంది.. ఒక్కొక్కరికీ అంటుకుంటోంది.. టీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ నేతలందరినీ చుట్టుముట్టేస్తోంది.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​ పద్మారావుగౌడ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆయన హోం క్వారంటైన్​లో ఉన్నారని సమాచారం. ఒకరోజు ముందే డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి కరోనా ప్రబలింది. టీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగలా గణేష్ గుప్తా, […]

Read More
15వేల మార్క్​దాటిన కరోనా

15వేల మార్క్ ​దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి 15వేల మార్క్​ దాటింది. సోమవారం తాజాగా తెలంగాణలో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15,394 కేసులు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. తాజాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 861 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు, మేడ్చల్ జిల్లాలో 20 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Read More

అభివృద్ధికి చిరునామా తెలంగాణ

సారథిన్యూస్​, రామడుగు: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి చిరునామా అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం MLA సుంకే రవిశంకర్ శంకుస్థపాన చేశారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మైదానంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సర్పంచ్ జీవన్, ఎంపీపీ కవిత నాయకులు జితేందర్ రెడ్డి, కర్ణాకర్, కల్గెటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More
దారుణంగా కరోనా పరిస్థితి

దారుణంగా కరోనా పరిస్థితి

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని కరోనా కేసులు రోజు రోజుకూ రెట్టింపు అవుతున్నాయని టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, రాష్ట్రంలో చాలా తక్కువ టెస్టులు చేస్తున్నారని ఇందులో కూడా పారదర్శకత లేదన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 32.1 శాతంగా ఉందని ఆయన ఆందోళన […]

Read More

సచివాలయం కూల్చివేతకు లైన్​క్లియర్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేయొచ్చని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. క్యాబినెట్​ తీసుకొనే విధానపరమైన నిర్ణయాలను తప్పు పట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లితుందని కాంగ్రెస్​ కోర్టుకు వెళ్లారు. విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అడ్డకోకుడదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది.

Read More

హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్తి లాక్‌డౌన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. కాగా తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. […]

Read More