జెనీవా: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ఐరోపా దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికాతోపాటు దక్షిణాసియా దేశాల్లో కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాతోపాటు ఐరోపాలోని పదిదేశాల్లో గత 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆఫ్రికా దేశాల్లోనూ వైరస్ రోజురోజుకి పెరుగుతున్నదని టెడ్రోస్ పేర్కొన్నారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికంటే తక్కువగానే ఉన్నప్పటికీ […]