ముంబై: టీమిండియా క్రికెటర్లు ఇంకా ఔట్‌డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టకపోయినా.. ఆగస్టులో శ్రీలంక పర్యటనను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. 3వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కోహ్లీసేన అక్కడ పర్యటించనుంది. ఈ సిరీస్‌కు సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. లంకకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా తెలుస్తున్నది. ఎఫ్టీపీ ప్రకారం ఈ సిరీస్‌ను జూన్‌లో నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి పెరుగుతుండడతో […]
న్యూఢిల్లీ: తాను ఒకప్పుడు బ్యాటింగ్ మార్చేసినట్లుగా ఇప్పుడు ఆడితే.. జట్టులో చోటు కష్టమేనని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ప్రస్తుతం బ్యాట్స్ మెన్ల స్ట్రయిక్ రేట్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నాడు. ‘సుదీర్ఘంగా క్రీజులో పాతుకుపోవడం, బౌలర్లు అలసిపోయేలా చేయడం, బంతి పాతబడేలా చేసి ఆటను సులువుగా మార్చేయడం వంటి నేను చేశా. అది నా బాధ్యత కూడా. ఆ పనిని గర్వంగా భావిస్తా. అయితే నేను సెహ్వాగ్ లా భారీ షాట్స్ ఆడలేనని […]
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. క్రికెట్ పై అప్పట్లో ఎలా ఉండేవాడో ఇప్పుడు అదే దృక్పథం, అంకితభావంతో ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అతనితో కలిసి పోటీపడడం తన అదృష్టమని చెప్పాడు. ‘చిన్నప్పటి నుంచి కోహ్లీ ఎదుగుదలను చూస్తున్నా. క్రికెట్ అంటే ప్రాణం పెడతాడు. నేను, అతను ఒకే తరంలో క్రికెట్ ఆడడం నా అదృష్టంగా భావిస్తున్నా. చిన్న వయసులోనే మేమిద్దరం కలుసుకున్నాం. అప్పట్నించి ఓ […]
న్యూఢిల్లీ : టీమిండియాలో మిగిలిన వాళ్లతో పొలిస్తే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్టయిలే వేరు. ఆటలోనే కాకుండా తన మేకోవర్ విషయంలోనూ అంతా ప్రత్యేకమే. లుక్స్ పరంగా ఓ కరీబియన్‌ను తలపిస్తాడు. పెద్దపెద్ద వాచ్‌లు, చెయిన్లు, రంగురంగుల దుస్తులతో చాలా డిఫెరెంట్‌గా కనిపిస్తుంటాడు. తన కాబోయే భార్య నటాషాను ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు కూడా హార్దిక్ డిఫరెంట్ లుక్‌లోనే ఉన్నాడట. హార్దిక్‌ను చూసి.. వీడెవడో తేడా మనిషిలా ఉన్నాడే అని నటాషా అనుకుందట. త్వరలో పెళ్లి చేసుకోనున్న […]
లండన్: ఆటలోనే కాదు.. ఆదాయం సంపాదనలోనూ క్రికెట్ టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. ఫోర్బ్స్ రిచ్చెస్ట్ అథ్లెట్ల జాబితాలో చోటు సంపాదించిన విరాట్.. మరో ఘనతను కూడా సాధించాడు. లాక్‌డౌన్ కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్డ్ పోస్ట్‌ల ద్వారా అత్యధికంగా ఆర్జించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. మార్చి 12 నుంచి మే 14వ తేదీ వరకు సేకరించిన డాటా ప్రకారం విరాట్ ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సమయంలో స్పాన్సర్డ్ పోస్ట్‌ల ద్వారా కోహ్లీ రూ.3.63కోట్లు […]
న్యూఢిల్లీ: ఓవైపు కరోనా భయపెడుతున్నా.. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక క్రికెటర్లు ట్రైనింగ్ మొదలుపెట్టారు. కానీ టీమిండియా మాత్రం ఈ విషయంలో ఇంకా వెనకడుగు వేస్తూనే ఉంది. మరి భారత క్రికెటర్లు ట్రైనింగ్ ఎప్పుడు మొదలుపెడతారన్న దానిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ కొద్దిగా స్పష్టత ఇచ్చాడు. క్రికెటర్ల ప్రాక్టీస్‌కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), క్రికెట్ ఆపరేషన్స్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నాడు. ‘ఇప్పుడు మా ముందున్న లక్ష్యం.. క్రికెట్‌ను మొదలుపెట్టడం. ఇందుకు […]
న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్ యుగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను మించిన వాళ్లు లేరని లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. భారత క్రికెట్ జట్టు విజయాలలో ఈ ఇద్దరి పాత్ర వెలకట్టలేనిదన్నాడు. అందుకే సమకాలిన క్రికెట్ లో ఈ తరం వాళ్లదేనని స్పష్టం చేశాడు. ‘మేం ఆడే రోజుల్లో ద్రవిడ్, దాదా అద్భుతంగా ఆడేవాళ్లు. కేవలం క్రికెటింగ్ షాట్లతోనే పరుగులు సాధించేవారు. సాంకేతికంగా కూడా ఈ ఇద్దరు చాలా […]
లండన్: ప్రపంచంలో అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రూ.196 కోట్ల ఆదాయంతో 66వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే 34 స్థానాలు పైకి ఎగబాకాడు. ఈసారి కూడా భారత్ నుంచి విరాట్ మినహా మరెవరికీ చోటు దక్కలేదు. ఇక స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్.. రూ.801 కోట్లతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టెన్నిస్ ప్లేయర్‌కు టాప్ ప్లేస్ దక్కడం ఇదే తొలిసారి. సాకర్ […]