సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో మంగళవారం సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు దబ్బకట్ల లక్ష్మయ్య, రాజయ్య మాట్లాడుతూ.. రాజయ్యకు వాజేడు మండల ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేశారు. మండల ప్రజలను రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించే వారని అన్నారు. మండలంలోని గ్రామాల అభివృద్ధికి తను శాసనసభ నిధులను వెచ్చించి పనిచేసేవారని అన్నారు, వ్యవసాయ కార్మిక, రైతాంగ, పోరాటాల్లో […]
బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన సున్నం రాజయ్య ఆటోలో సెక్రటేరియట్‌కు వచ్చిన ప్రజానేత సారథి న్యూస్, హైదరాబాద్: ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు తరాలకు తరగదని ఆస్తులు సంపాదించుకుంటున్న రోజులివి.. కానీ ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత కారు కూడా లేని ప్రజానేత.. బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన ఘనచరిత.. ఆయనే మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య. కరోనా బారినపడి కన్నుమూయడాన్ని ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు తట్టుకోలేకపోతున్నారు. సహజంగా ప్రజాప్రతినిధి అనగానే కార్లు, సెక్యూరిటీ సిబ్బంది ఇలా […]