సారథి న్యూస్, పెద్దశంకరంపేట: సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడ పిల్లలకు వరం లాంటిదని సంగారెడ్డి సబ్ డివిజన్ మెయిల్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట పోస్ట్ ఆఫీస్ లో పలువురు తల్లిదండ్రులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. కూతుళ్లు పుట్టిన తల్లిదండ్రులకు ఈ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు పోస్టాఫీసును సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎస్పీఎం అనిల్ కుమార్, బీపీఎంలు సుదర్శన్, రాఘవేందర్, గంగారాం మామయ్య, విజయ్ కుమార్, సిబ్బంది […]