సారథి న్యూస్, దుబ్బాక: మాధవనేని రఘునందన్‌రావు టీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి బీజేపీలో రాష్ట్రస్థాయి కీలకనేతగా ఎదిగారు. రాజకీయాలకు రాక ముందు ఆయన ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టాపొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్లింది. ఉమ్మడి మెదక్‌జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా దుబ్బాక […]
సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీచేసేందుకు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు దాదాపు ఖరారు చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీష్‌రెడ్డికి టికెట్ దక్కడం దాదాపు ఖాయమనే […]