సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతోంది. వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం జలాశాయానికి మరింత వరద వచ్చింది. ఈ సీజన్‌లో ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంభించారు. 3 టర్బయిన్ల ద్వారా 0.474 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ఉత్పత్తిని ప్రారంభించలేదు. శ్రీశైలలం జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 77,534 క్యూసెక్కులు కొనసాగుతోంది. రిజర్వాయర్పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, […]
సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణార్థం శ్రీశైలం భ్రమరాంబదేవి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఆలయంలో ఊయల సేవ నిర్వహించినట్లు ఈవో రామారావు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలనక్షత్రం రోజున అమ్మవారికి ఊయల సేవ నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు అర్చకులు మహాగణపతి పూజ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ, సహస్త్ర నామపూజలు జరిపించినట్లు ఈవో రామారావు వెల్లడించారు.
డ్యామ్‌లో 815 అడుగుల నీటిమట్టం జూరాల 8గేట్లు ఎత్తి నీటి విడుదల సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉరకలెత్తుతోంది. కర్ణాటక, మహారాష్ర్ట ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్‌కు నీటిని వదిలారు. అక్కడి నుంచి జూరాలకు ప్రస్తుతం 60వేల క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.440 మీటర్లకు చేరింది. నీటి […]