సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. శుక్రవారం పవన్‌కల్యాణ్‌తో భేటీ ఆయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీర్రాజు ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టాక బీజేపీలోని ఓ వర్గం నేతలు, వైఎస్సార్సీపీ నేతలు ఖుషీగా ఉండగా.. టీడీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఏపీ బీజేపీలో చంద్రబాబు పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నారని.. ఆయన కొందరు నేతలను కోవర్టులుగా పంపి రాజకీయం నడిపిస్తున్నారని కొంతకాలంగా […]