సారథి న్యూస్, కర్నూలు: సీపీఎం సీనియర్ నేత, పార్టీ కర్నూలు జిల్లా కమిటీ సభ్యుడు టి.షడ్రక్(62)మంగళవారం కరోనాతో తనువు చాలించారు. కొద్దిరోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ప్రాణం విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ఖాన్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటని జిల్లా […]