సారథిన్యూస్, సిరిసిల్ల: ఇటీవల మరణించిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కాస్బె కట్కూర్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కట్కూర్‌కు చెందిన లక్ష్మమ్మ అనే మహిళ దగ్గు, తుమ్ములతో సోమవారం మృతిచెందింది. అదేరోజు ఆమెకు సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు రాకముందే మహిళకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా లక్ష్మమ్మకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. దీంతో అంత్యక్రియల్లో పాల్గన్నవారందరినీ అధికారులు గుర్తించి హోం క్వారంటైన్‌కు […]
సారథిన్యూస్, సిరిసిల్ల: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. బుధవారం ఏబీవీపీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా డీఈవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిరిసిల్లోని విద్యానగర్ లో అనుమతి లేకుండా శ్రీచైతన్య పాఠశాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారవేని రంజిత్‌కుమార్, నాయకులు ప్రశాంత్, వినయ్, ప్రణయ్ తదితరులు ఉన్నారు.