Breaking News

SI

ఏసీబీకి చిక్కిన సీఐ

సారథిన్యూస్​, చేవెళ్ల: భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్​ సీఐ శంకరయ్య ఓ వ్యక్తికి సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. లక్ష 20వేలు లంచం డిమాండ్​ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం షాబాద్​ పీఎస్​లో శంకరయ్య యాదవ్​, ఏఎస్సై రాజేందర్..​ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. సీఐ శంకరయ్యపై గతంలోనూ అవినీతి కేసులున్నాయి. రంగారెడ్డి […]

Read More

ఎస్సైకి ఘనసన్మానం

సారథి న్యూస్​, హయత్​నగర్​(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎస్సైగా పనిచేసి.. ట్రాన్స్​ఫర్​పై వెళ్తున్న సైదారెడ్డిని స్థానిక వార్డుసభ్యుడు మొగుళ్ల జీవన్ రెడ్డి, టీఆర్​ఎస్​ నాయకుడు మొగుళ్ల వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. మూడేళ్లపాటు ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో విశేషసేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎం.నరేష్ గౌడ్, ఎండీ ఇమ్ము, వినీత్ గౌడ్, అఖిల్ రెడ్డి, సందీప్, అజయ్, సాధిక్, మహేష్ పాల్గొన్నారు.

Read More