అందమైన ప్రేమకథలను ఆహ్లాదంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి జంటతో ‘లవ్ స్టోరీ’ ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ బుధవారం పూర్తయింది. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పాట చిత్రీకరణతో షూటింగ్ కంప్లీట్ అవడంతో గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల, సాయిపల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి.కుమార్ సెలబ్రేట్ చేసుకున్నారు. షూటింగ్ పూర్తయ్యిందన్న విషయాన్ని తెలుపుతూ అందుకు […]
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. ఆయన తండ్రి శేషయ్య శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడతున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్ బన్సీలాల్ శ్మశానవాటికలో శేషయ్యకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు శేఖర్ కమ్ములకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్‌స్టోరీ’ అనే సినిమా తీస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ కరోనా లాక్‌డౌన్‌తో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్‌స్టోరీ’ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగనున్నది. ఫిదా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని శేఖర్‌కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి నటిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అగష్టు మొదటివారం నుంచి రామోజీఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరుగనున్నట్టు సమాచారం. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నది.
టాలీవుడ్లో ఫీల్ గుడ్ ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరైన శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతోంది. తీసిన సినిమాలు పది. అన్నీ గుర్తింపు పొందిన సినిమాలే. గ్యాప్‌లు ఎక్కువ తీసుకున్నా కంటెంట్ ప్రాధాన్యం ఉన్న సినిమాలే తీయడం శేఖర్ కమ్ముల స్టైల్. ప్రేక్షకుల ఎదురు చూపులు, అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా కథల ఎంచుకునే డైరెక్టర్ శేఖర్ ‘ఫిదా’ చిత్రం తర్వాత శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ […]