సారథి న్యూస్, షాద్‌నగర్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు దత్తపుత్రిక ప్రత్యూష, చరణ్ రెడ్డి వివాహం సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని లూర్దుమాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆదివారం సీఎం సతీమణి శోభ, గిరిజన, మహిళా సంక్షేశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు ప్రత్యూషను పెళ్లి కూతురు చేశారు.
సారథి న్యూస్, షాద్‌నగర్: విద్యుత్ షాక్ తో బాబాయ్, అబ్బాయి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనతో గురువారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్బాయి, బాబాయ్గాండ్ల సురేష్(45), గాండ్ల అభిలాష్(18) పొలం వద్ద బోరు మోటార్ ను రిపేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇనుప పైపులను వెలికితీస్తుండగా పైనున్న11 కేవీ హై టెన్షన్ తీగలకు తగిలాయి. విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో మొగిలిగిద్దలో తీవ్ర విషాదం […]
సారథి న్యూస్, షాద్‌నగర్: ఈనెల 19న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కిడ్నప్ నకు గురై కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ శివారులో విగతజీవిగా పడి ఉన్న రామచంద్రారెడ్డి హత్య కేసులో నిందితులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భూవివాదమే ప్రాణం తీసినట్లు పోలీసులు తేల్చారు. సోమవారం వివరాలను షాద్ నగర్ ఏసీపీ సురేందర్ వెల్లడించారు. ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డికి కొంతకాలంగా […]
సారథి న్యూస్, షాద్‌నగర్: కాంగ్రెస్ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి అలియాస్ పెట్రోల్ పంపు రామచంద్రారెడ్డి శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కిడ్నాప్, హత్యకు గురయ్యారు. కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో రామచంద్రారెడ్డిని ఆయన బంధువైన అన్నారం ప్రతాప్ రెడ్డి మరొకరు కలిసి హత్య చేసినట్లు షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏసీపీ వి.సురేందర్ వెల్లడించారు. తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన ప్రాధమిక పూర్వాపరాలను […]
సారథి న్యూస్, షాద్‌నగర్: ఆ చిన్నారులకు జన్మనిచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. చిన్నారుల ఆలనాపాలనా తండ్రికి భారంగా మారింది.. ముక్కుపచ్చలారని ఆ పసిబిడ్డలను లాలించలేనని శిశువిహార్‌కు అప్పగించాడు. కన్నపేగు కలతచెంది బిడ్డలను వెతుక్కుంటూ వెళ్లింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన గణేశ్ 16ఏళ్ల క్రితం షాద్ నగర్ కు బతుకుదెరువు కోసం వలస వచ్చాడు. పట్టణంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం […]
సారథి న్యూస్, షాద్‌నగర్: ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీని కలెక్టర్ అమోయ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక సోలీపూర్, హాజిపల్లి రోడ్డులో చేపట్టిన పారిశుద్ధ్య పనులు, ఫరూఖ్ నగర్ లోని జానమ్మ చెరువును పరిశీలించారు. చెరువు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ లావణ్య కలెక్టర్ కు వివరించారు. హరితహారంలో పట్టణంలో విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. పారిశుద్ధ్య పనులను పూర్తిస్థాయిలో చేపట్టి సీజనల్ […]
– ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజ్ సారథి న్యూస్, షాద్ నగర్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా షాద్‌నగర్ పట్టణ ప్రజలు సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజ్ సూచించారు. కరోనా నివారణపై 8వ తరగతి విద్యార్థిని లోకేశ్వరి రూపొందించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. కిరాణాషాపులు, ఇతర సముదాయాల వద్ద ప్రజలు తప్పకుండా సామాజిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్ భాస్కర్, […]