తాను కరోనా నుంచి కోలుకున్నానని బుల్లితెర స్టార్ హీరోయిన్, ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్ నవ్య స్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. కొంతకాలం క్రితం నవ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ‘ నా క్వారంటైన్ లైఫ్ పూర్తయింది. ఇంతకుముందుకంటే బాగున్నాను. అందరూ ఇచ్చిన ధైర్యంతోనే కోలుకున్నాను. దాదాపు 3 వారాలపాటు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. […]
సారథిన్యూస్, హైదరాబాద్: అన్ని రంగాలవారిని కరోనా వణికిస్తున్నది. వైద్యులు, జర్నలిస్టులు, రాజకీయనాయకులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఓ తెలుగు సీరియల్ నటుడికి కరోనా సోకింది. లాక్డౌన్ సడలింపులతో టీవీ సీరియల్స్ షూటింగ్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓ టీవీ సీరియల్ దర్శకుడికి కరోనా సోకగా తాజాగా గృహలక్ష్మి సీరియల్ నటుడు హరికృష్ణకు కరోనా సోకింది. దీంతో శుక్రవారం జరగాల్సిన ఈ సీరియల్ షూటింగ్‌ను నిలిపివేశారు. ఇటీవలే కరోనా సోకిన టీవీనటుడు ప్రభాకర్‌తో హరికృష్ణ కాంటాక్ట్ అయ్యాడు. […]