సారథి న్యూస్, వాజేడు, ములుగు: ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి కె.రమాదేవి సూచించారు. సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో ప్రజావిజ్ఞప్తులు, ఈ- ఆఫీస్, పల్లెప్రగతి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటివరకు 646 దరఖాస్తులు రాగా, 358 పరిష్కరించామని, 288 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజావాణిలో 21 రెవెన్యూ శాఖకు సంబంధించి, మూడు ఆసరా పెన్షన్లు, […]