సామాజికసారథి, హైదరాబాద్: జులై 1వ తేదీన టెట్(TET)ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆమె విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. టెట్ ఫలితాల వెల్లడిలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్ఈఆర్టీ(SCERT) డైరెక్టర్రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఎస్సీఈఆర్టీ 1నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని రకాల స్కూలు టెక్ట్స్ బుక్స్ ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఇవి పీడీఎఫ్ రూపంలో ఈ వెబ్ సైట్ లో లభిస్తున్నాయి. కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు.Telangana Board Textbooks @scert.telangana.gov.in