Breaking News

SC CARPORATION

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

సారథి, కోడేరు: నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరు మండలంలోని నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ నాయక్ తెలిపారు. మండలంలోని కోడేరు, తీగలపల్లి, జనంపల్లి, బావాయ్ పల్లి, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, పసుపుల గ్రామాల అభ్యర్థులు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని బుధవారం ఎంపీడీవో ఆఫీసుకు 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. అలాగే రేమద్దుల, సింగోటం, కల్వకోలు బ్యాంకు ఖాతాదారులు 24వ తారీఖున హాజరుకావాలని ఆయన సూచించారు.

Read More
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.19 కోట్ల రుణాలు

నిరుద్యోగులకు ‘కార్పొరేషన్​’ రుణాలు

సారథి న్యూస్, మెదక్: జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ(ఎస్సీ కార్పొరేషన్​) ఆధ్వర్యంలో ఈ ఏడాది 448 మంది లబ్ధిదారులకు రూ.19.18 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా ఇన్​చార్జ్​కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో రూ.12.35 కోట్ల సబ్సిడీ కాగా, రూ.6.63 కోట్ల బ్యాంకు రుణం, లబ్ధిదారుల వాటా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంస్థ ద్వారా అమలుచేస్తున్న రూ.లక్షలోపు పథకాలకు 80 శాతం సబ్సిడీ, రూ.రెండు లక్షల్లోపు పథకాలకు […]

Read More