తమిళనాడు సంక్రాంతి వేడుకలు 31 వరకు అమలులో కరోనా నిబంధనలు చెన్నై: పొంగల్ సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జల్లికట్టు క్రీడా పోటీలు రాష్ట్రంలో ముందుగా పుదుకోట జిల్లాలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు పశు సంవర్థక శాఖ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించిన 300 పోట్ల గిత్తలు, రెండు టీకాలు వేసుకున్న 700 మంది యువకులను ఈ పోటీలకు అనుమతించారు. జిల్లాలోని గంధర్వకోట సమీపంలో వున్న తచ్చాంకుర్చి గ్రామంలో ఉదయం రాష్ట్ర మంత్రులు రఘుపతి, […]