సారథి న్యూస్, హుస్నాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్షలో భాగంగా సిద్దిపేట్ జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల భూమిపూజ […]