‘సామాజికసారథి’ క్యాలెండర్ల ఆవిష్కరణలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్ బ్యూరో: ‘సామాజికసారథి తెలుగు’ దినపత్రిక 2024 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, పత్రికలు ప్రజాపక్షం వహించాలని కోరారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఎందరో మహనీయులు పత్రికల ద్వారా ప్రజల్లో […]