గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లాలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుమ్మడిదల మండలం దోమడుగులోని సాల్వెంట్ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. జీడిమెట్ల, అన్నారం ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.