హైదరాబాద్: గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్‌ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ‘సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్’లో భాగంగా ఈ డేటా సెంటర్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. కాగా, ఈ సెంటర్‌లో భారీ తెరను ఏర్పాటుచేశారు. దీని మీద ఒకేసారి ఐదువేల సీసీ కెమెరాలకు చెందిన లైవ్ దృశ్యాలను వీక్షించొచ్చు. […]