సామాజికసారథి, హైదరాబాద్: జులై 1వ తేదీన టెట్(TET)ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆమె విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. టెట్ ఫలితాల వెల్లడిలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్ఈఆర్టీ(SCERT) డైరెక్టర్రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
సామాజికసారథి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన పదో తరగతి(tenth class) ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలని ఆమె సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.టెన్త్(ssc) ఫలితాల కోసంwww.bse.telangana.gov.in, www.bseresults.telangana.gov.inవెబ్సైట్లో సంప్రదించాలని కోరారు.
సామాజిక సారథి, రాజేంద్రనగర్ : జల్ పల్లీ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ లు ఎర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జల్ పల్లీ పెద్ద చెరువును స్థానిక ప్రజా ప్రతినిధిలతో కలసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముత్యాలమ్మ దేవాలయం నుండి మామిడిపల్లి వరకు సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ కూడా ఎర్పాటు చేయనున్నట్లు తెలిపారు. […]
సారథి న్యూస్, మహేశ్వరం: అర్హత కలిగి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రూ.1.30 కోట్ల వ్యయంతో నాగారం, మన్సాన్‌పల్లి, మన్సాన్‌పల్లి చౌరస్తా, పెండ్యాల, దుబ్బచర్ల, దిల్‌వార్‌గూడ గ్రామాల్లో రైతు వేదికలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. 287 డిజైన్లతో బంగారు, వెండి అంచులో చీరలను తయారుచేసినట్లు వెల్లడించారు. రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. బతుకమ్మ పండుగకు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు. మంగళవారం బేగంపేట హరితప్లాజాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రులు కె.తారక రామారావు, సబితాఇంద్రారెడ్డి, […]