సారథి న్యూస్, మహబూబ్‌నగర్: స్వేరోస్ సేవాగుణం చాటుకున్నారు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. స్వేరోస్ అనుబంధ సంస్థ అయిన ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యుడు, తెలంగాణ గురుకులాల క్రీడల అధికారి ఎం.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూగంజ్ లో పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తితో తమవంతు సేవ చేస్తున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో బాలనర్సిములు, […]