సారథి న్యూస్, మెదక్: ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా రోడ్ల పరిస్థితిపై హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ కోతకు గురయ్యాయన్నారు. ఆర్అండ్ బీ అధికారులు అప్రమత్తంగా ఉండి మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన, శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన పనులను గుర్తించాలన్నారు. జీవోనం.2 కింద మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని […]