సారథి న్యూస్, రామడుగు: రైతులు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధరతోపాటు అదనంగా బోనస్ కల్పించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. రైతుబంధును ఏ విధమైన షరతులు లేకుండా అమలు చేయాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలను వేయాలనడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో నాయకులు జెట్టవేని అంజి బాబు, బోయిని వెంకటేశం, మ్యాడారం సత్యనారాయణ, గాలిపల్లి రాజు పాల్గొన్నారు.