సారథిన్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సోమవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. 32 మంది లబ్ధిదారులకు రూ. 8 లక్షల 45 వేల చెక్కులను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులు రమేశ్‌గౌడ్, బండారు స్వామి తదితరులు పాల్గొన్నారు.